బంగారం కొనే వారికి శుభవార్త.. దిగొచ్చిన ధరలు.. ఈరోజు రేట్లు ఇలా! | Gold rates are Down | Slashed
25/04/2021 Blog, Business, Jewellery, Lifestyleబంగారం కొనే వారికి శుభవార్త.. దిగొచ్చిన ధరలు.. ఈరోజు రేట్లు ఇలా!
బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అయితే వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది.
ప్రధానాంశాలు:
తగ్గిన బంగారం ధర
పసిడి నేలచూపులు
వెండి మాత్రం పైపైకి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Gold rate
బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించేు అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పైపైకి చేరింది.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గుదలతో రూ.48,870కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 క్షీణతతో రూ.44,800కు తగ్గింది.
బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర కేజీకి రూ.400 పెరుగుదలతో రూ.74,300కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.